Bhimaa Movie X Review: భీమాతో గోపించంద్ మాస్ ఫీస్ట్.. శివరాత్రికి శివతాండవమేనట!

టాలీవుడ్ మాచో స్టార్ గోపిచంద్(Gopichand) హీరోగా వచ్చిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ భీమా(Bhimaa). కన్నడ దర్శకుడు హర్ష(Harsha) తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్(Priya Bhavani shankar), మాళవిక శర్మ(Malavika Sharma) హీరోయిన్స్ గా నటించారు. పక్కా మాస్ మసాలా కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ ను ఫుల్లుగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. అంతేకాదు.. కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కూడా భీమా సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా శివరాత్రి కానుకగా నేడు(మార్చ్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

ఇప్పటికే చాల చోట్ల ప్రీమియర్స్ పడటంతో సినిమా చూసిన ఆడియన్స్ భీమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాల వైదికగా పంచుకుంటున్నారు. మరి భీమా సినిమా ఎలా ఉంది? సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారు? గోపిచంద్ హిట్టు కొట్టారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

భీమా సినిమాకు ఆడియన్స్ నుండి మాస్ రియాక్షన్స్ వస్తున్నాయి. సినిమా చాలా బాగుంది, రొటీన్ కథే అయినా ప్రెజెంట్ చేసిన విధానం బాగుందని, ఇక గోపించంద్ మాస్ ఫీస్ట్ నెక్సల్ లెవల్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరేమో శివరాత్రికి థియేటర్స్ లో గోపీచంద్ శివతాండవం ఆడారని, పక్కా మాస్ బొమ్మతో పండుగకు ఫుల్ మీల్స్ పెట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా భీమాకు రవి బాసృర్ అందించిన సంగీతం సినిమాను నెక్స్ట లెవల్ కు తీసుకెళ్లిందని సినిమాకు హీరో ఆయనే కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరేమో భీమా గురించి మాట్లాడుతూ.. ఇదొక రొటీన్ కమర్షియల్ మూవీ అని, కొత్తగా ఏమీ లేదని కానీ, మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.