Bhimaa Movie OTT: గోపీచంద్ భీమా ఓటీటీ రైట్స్..డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు

గోపీచంద్ (Gopichand) హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష (Harsha) తెరకెక్కించిన చిత్రం భీమా (Bhimaa). ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌‌‌‌గా నటించారు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఇవాళ మహా శివరాత్రి సందర్భంగా (మార్చి 8న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటవ్ టాక్ తెచ్చుకుంది.

యూనిక్ యాక్షన్‌‌ ఎంటర్‌‌టైనర్‌‌గా వచ్చిన ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా, ప‌ర‌శురాముడి గుడిని కాపాడే యోధుడిగా రెండు క్యారెక్ట‌ర్స్‌లో నటించి మెప్పించారు. ఈ సినిమాతో గోపీచంద్ కమ్ బ్యాక్ పక్కా అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సలార్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.  

ఓటీటీ రైట్స్..డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు:

ఇదిలా ఉంటే ప్రస్తుతం భీమా ఓటీటీ రైట్స్, డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) దక్కించుకున్నట్లు సమాచారం. అలాగే శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా (Star Maa Channel) సొంతం చేసుకుంది.

అయితే, ఓటీటీ అండ్ శాటిలైట్ హక్కులు అన్ని కలిపి మొత్తంగా రూ. 20 కోట్ల వరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఇవాళ సినిమా థియేటర్స్ లో ఎండ్ టైటిల్ కార్డ్స్ లో భీమా ఓటీటీ పార్టనర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అని ఉంది. దీంతో జిటల్ స్ట్రీమింగ్ వివరాలు బయటకి వచ్చాయి.

ALSO READ :- NBK 109 Glimpse: సింహం నక్కల మీదకు వస్తే.. వార్ అవ్వదురా లఫూట్..ఇట్స్ హంటింగ్

మరి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయానికి వస్తే..విడుదలైన నెల రోజులకు అంటే, ఏప్రిల్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.