Bhimaa OTT: OTTకి వచ్చేస్తున్న సూపర్ హిట్ భీమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్(Gopichand) హీరోగా  మాస్ ఎంటర్టైనర్ భీమా(Bimaa). కన్నడ దర్శకుడు హర్ష(A Harsha) తెరకెక్కించిన ఈ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో మాళవిక శర్మ(Malavika sharma), ప్రియా భవాని శంకర్(Priya Bhavani Shankar) హీరోయిన్స్ నటించారు. గోపీచంద్ డ్యూయల్ రోల్ లో కనిపించిన ఈ సినిమా మార్చ్ 8 శివరాత్రి కానుకగా విడుదలై సూపర్ హిట్ నిలిచింది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ లవర్స్ ను ఫుల్లుగా నచ్చేసింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. చాలా కాలంగా హిట్ లేక సతమతమవుతున్న గోపిచంద్ కు మంచి కంబ్యాక్ ఇచ్చింది ఈ మూవీ.

 ఇక భీమా సినిమా విడుదలై నెలరోజులు దగ్గరవుతున్న క్రమంలో ఓటీటీ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ హక్కులను రైట్స్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్ మేరకు భీమా సినిమాను ఏప్రిల్ 5 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచినా ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

ఇక గోపించంద్ తరువాతి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్లతో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2024 ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఇక ఈ సినిమా కూడా దర్శకుడు శ్రీను వైట్ల గాథక్ చిత్రాలు మాదిరిగానే.. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు.. ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తుందని టాక్.