JAAT Box Office: వందకోట్ల క్లబ్ లోకి జాట్.. హిందీ గడ్డపై తెలుగోడి మాస్ ఫీస్ట్ అదిరింది

JAAT Box Office: వందకోట్ల క్లబ్ లోకి జాట్.. హిందీ గడ్డపై తెలుగోడి మాస్ ఫీస్ట్ అదిరింది

బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటించిన 'జాట్' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ హిందీ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది.

ఏప్రిల్ 10న రిలీజైన మాస్ కమర్షియల్ జాట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.102.13 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. హిందీ గడ్డపై తెలుగోడి మాస్ ఫీస్ట్ కొనసాగుతోంది అనేలా మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. కాగా ఈ మూవీ 12 రోజుల్లో రూ.75.42కోట్ల షేర్ వసూళ్లు చేసింది. సెకండ్ వీకెండ్ లో 11వ రోజైన శనివారం ఒక్కరోజే రూ.5కోట్ల నెట్ సాధించగా, ఆదివారం (12వరోజు) రూ.1.02 కోట్లు రాబట్టింది.

ఈ మూవీ సన్నీ డియోల్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా 'జాట్' నిలిచింది. అయితే, మధ్యలో 'కేసరి చాప్టర్ 2' ఏప్రిల్ 18న రిలీజై  జాట్ వసూళ్లను తగ్గించేలా చేస్తోంది.

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. రెజీనా, స‌యామీఖేర్‌, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. రణదీప్ హుడా మరియు వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. 

సన్నీ డియోల్ గత చిత్రాలు గదర్, గదర్ 2సినిమాల తర్వాత జాట్ హయ్యెస్ట్ వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమాతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని భారీ సక్సెస్ అందుకున్నారు. జాట్ ఇచ్చిన సక్సెస్తో బాలీవుడ్ మాస్ హీరోలు తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఈ క్రమంలోనే జాట్ నిర్మాతలు మైత్రి మేకర్స్ సెకండ్ పార్ట్ తెరకెక్కంచనున్నట్లు ప్రకటించారు.