బాలీవుడ్ స్టార్స్ ఇటీవల సౌత్ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ‘గదర్ 2’తో గతేడాది స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన యాక్షన్ హీరో సన్నీడియోల్ (Sunny Deol) కూడా తెలుగు దర్శకుడితో కలిసి వర్క్ చేస్తూ బిజీగా ఉన్నాడు.
క్రాక్, వీరసింహా రెడ్డి లాంటి సక్సెస్‌ఫుల్ మూవీస్ తర్వాత గోపీచంద్ మలినేని (Gopichandh Malinen) డైరెక్ట్ చేయబోతున్న చిత్రమిది. మైత్రీ మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు కలిసి జాట్ (JATT) మూవీని నిర్మిస్తునాయి.
తాజాగా నేడు శుక్రవారం (డిసెంబర్ 6న) జాట్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ ఫీస్ట్ లా ఉంది ఈ టీజర్. సన్నీ డియోల్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన మ్యాసీవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
Also Read:-అఫీషియల్.. ఓటీటీలోకి సూర్య కంగువ మూవీ..
సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు.రిషి పంజాబీ డీవోపీ. తమన్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, అనల్ అరసు, వెంకట్ మాస్టర్స్ ఫైట్ కొరియోగ్రాఫర్స్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ 2025 ఏప్రిల్లో రిలీజ్ కానుంది.