గోపీచంద్, కావ్య థాపర్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’. టీజీ విశ్వ ప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (అక్టోబర్ 11) విడుదలైంది. దీంతో ఇటీవలే విశ్వం చిత్రం టీమ్ ప్రెస్ మీట్ నిరవహించింది. ఇందులో భాగంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని తెలియజేసింది మూవీ టీమ్.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘మా నమ్మకాన్ని ఆడియెన్స్ ప్రూవ్ చేశారు. కామెడీ, మదర్ ఎమోషన్ ,ఫాదర్ ఎమోషన్, యాక్షన్ సీక్వెన్స్.. ప్రతి ఎలిమెంట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఫోన్ చేసి చాలా బాగుందని, ఎక్స్‌ట్రార్డినరీ అని చెబుతుంటే ఆనందంగా అనిపించింది’ అని అన్నాడు.
ఈ చిత్రంలో తన పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీ అంది కావ్య థాపర్. శ్రీనువైట్ల మాట్లాడుతూ ‘సినిమా చూసిన ఆడియెన్స్ ఎక్సయిటింగ్‌గా ఫీలవుతున్నారు. అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ రావడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. సక్సెస్ అందించిన ప్రేక్షకులకు నిర్మాత వేణు దోనేపూడి థ్యాంక్స్ చెప్పారు.