గోపీచంద్ విశ్వం మూవీ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

గోపీచంద్ విశ్వం మూవీ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌‌‌‌‌‌‌‌ బ్యానర్లపై  టీజీ విశ్వ ప్రసాద్,  వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. బుధవారం గోపీచంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ తెలియజేస్తూ కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.  ట్రెండీ కాస్ట్యూమ్స్‌‌‌‌‌‌‌‌లో స్పోర్ట్స్ బైక్ నడుపుతూ స్టైలిష్‌‌‌‌‌‌‌‌గా కనిపించాడు గోపీచంద్.  

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరుగుతోంది.  గోపీచంద్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 32వ సినిమా.  ఇప్పటికే విడుదలైన ఫస్ట్ స్ట్రైక్ వీడియోకు చక్కని స్పందన లభించింది.  ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌కు గోపీ మోహన్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ప్లే అందిస్తున్నాడు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు. గోపీచంద్ మార్క్‌‌‌‌‌‌‌‌ యాక్షన్‌‌‌‌‌‌‌‌తో పాటు శ్రీను వైట్ల మార్క్ వినోదం ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు.