‘సాహసం’ కాంబినేషన్లో గోపీచంద్ కొత్త మూవీ ప్రారంభం.. ఈ సారి మాస్ యాక్షన్ థ్రిల్లర్

‘సాహసం’ కాంబినేషన్లో గోపీచంద్ కొత్త మూవీ ప్రారంభం.. ఈ సారి మాస్ యాక్షన్ థ్రిల్లర్

వరుస ఫ్లాప్ లతో హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్.. మరో కొత్త చిత్రానికి క్లాప్ కొట్టాడు. ‘సాహసం’ సినిమాతో మంచి హిట్ ఇచ్చిన  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ ఆధ్వర్యంలో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రొడక్షన్ నెం.39 ను గురువారం (ఏప్రిల్ 24) ప్రారంభించారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ‘సాహసం’ సినిమా తర్వాత గోపీచంద్ తో మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ  మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండనుందని టీమ్ తెలిపింది. 

ఈ సినిమాతో కుమార్ వెల్లంకి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అలాగే 'సాహసం' సినిమాకు కెమెరామెన్‌గా పనిచేసిన షామ్‌దత్ ఈ సినిమాకు కూడా పనిచేయనుండడం విశేషం. ఈ చిత్రం ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా జరిగింది.

ఈ సినిమాలో గోపిచంద్ సరసన మలయాళ బ్యూటీ మీనాక్షి దినేశ్ నటిస్తోంది. ఈ సినిమాతో మళ్లీ కంబ్యాక్ ఇచ్చేందుకు గోపీచంద్ సిద్ధమవుతున్నాడు. మాస్ యాక్షన్ సీన్స్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే అఫీషియల్ గా రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది.