కాంగ్రెస్​లో చేరిన గోప్యా తండా సర్పంచ్

సిరికొండ,వెలుగు : సిరికొండ మండలం గోప్యా తండా సర్పంచ్​ రాంచందర్​సోమవారం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. భూపతిరెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్​తోనే అన్నీ వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు.

లీడర్లు, కార్యకర్తల సమష్టి కృషితో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కొండూర్ గ్రామానికి చెందిన లీడర్లు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసి బొకె అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెలమ భాస్కర్​రెడ్డి, రాములు నాయక్, సంతోష్​ పాల్గొన్నారు.