టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్‌భవన్‌లో ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
జూన్ 22 నుంచి రెండురోజుల పాటు ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల 174 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీఎం చంద్రబాబు గోరంట్లకు ఈ అవకాశం కల్పించారు. ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి (జూన్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ శాసన సభ ప్రారంభం కానుంది.