గొర్రెపాటి మాధవరావు మృతి తీరని లోటు

హైదరాబాద్​, వెలుగు: పౌర హక్కుల నేత గొర్రెపాటి మాధవరావు మృతిపై ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌర హక్కుల ఉద్యమంలో1980- నుంచి 1990 వరకు పనిచేసిన గొర్రె పాటి మాధవరావ్ (67) మృతి తీరని లోటని పేర్కొన్నారు.  గొర్రెపాటి చనిపోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మాధవరావు తన కండ్లు దానం చేయడంతో పాటు, శరీరాన్ని  వైద్య విద్యార్థుల పరిశోధనలకు  ఇచ్చినందుకు అభినందించారు.  నిజామాబాద్​లో  బీడీ కార్మికులకు మాధవరావు చేసిన సేవను కంచె ఐలయ్య కీర్తించారు.