
ఆర్మూర్, వెలుగు : జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్ శుక్రవారం గాంధీభవన్‌లో ఆర్మూర్ కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. శనివారం చేవెళ్లలో జరిగే ప్రజాగర్జన సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ తనకు ఆర్మూర్ టికెట్ ఇస్తే, ప్రజల మద్దతుతో నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగరేస్తామన్నారు.