ఈ రోజు కాకపోతే రేపైనా నీ తల నరికేస్తం.. ఎమ్మెల్యే రాజా సింగ్​కు బెదిరింపు కాల్స్

ఈ రోజు కాకపోతే రేపైనా నీ తల నరికేస్తం.. ఎమ్మెల్యే రాజా సింగ్​కు బెదిరింపు కాల్స్

బషీర్​బాగ్, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపులు ఎదురయ్యాయి. ఆగంతకులు  ఫోన్ కాల్స్ చేసి చంపేస్తామని హెచ్చరించారు. ఆదివారం రాజా సింగ్ మొబైల్ కు కాల్ చేసిన ఆగంతకులు తల నరికేస్తామని బెదిరించారు.

ఇయ్యాల కాకపోతే రేపు చంపేయడం మాత్రం పక్క అంటూ మాట్లాడినట్టు రాజా సింగ్ తెలిపారు. ప్రధాని మోదీ , యూపీ సీఎం యోగి వచ్చిన  ఎవరు కాపాడలేరని బెదిరించారని చెప్పారు. ఈ ఫోన్ కాల్స్ పై స్థానిక మంగళ్ హాట్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు రాజా సింగ్ వెల్లడించారు.