
వక్ఫ్ బోర్డ్ పేరుతో ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. వక్ఫ్ బోర్డ్ రాకముందు 4 వేల ఎకరాల భూములు ఉండేవి.. వక్ఫ్ బోర్డ్ ను అడ్డం పెట్టుకొని దాదాపు 9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు బిల్లు తేవడం ముస్లీంలకు వ్యతిరేకం కాదు..వాళ్ల భూములకు మోడీ రక్షణ కల్పిస్తారని అన్నారు.
వక్ఫ్ బిల్ పాస్ అయ్యిందని ఒవైసీ బ్రదర్స్ గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే రాజాసింగ్.ఒవైసీ బ్రదర్స్ అరుపులకు ఎవరు భయపడబోరని అన్నారు రాజాసింగ్. ముస్లింలను మోసం చేస్తున్న వ్యక్తి ఒవైసీ అనిఅన్నారు.రాం మందిర్ నిర్మాణం జరగదని ఓవైసీ భావించారు. శ్రీరామ నవమి రోజు జనసంద్రాన్ని చూసి ఒవైసీ కంగుతిన్నాడని అన్నారు రాజాసింగ్. ఓ వైపు మోడీ, మరో వైపు యోగి ఇద్దరి వైపు దేశం మొత్తం చూస్తుందన్నారు. ప్రస్తుతం ఇది మోడీ భారత్ అని అన్నారు. గతంలో రామ భక్తులు ఆలోచన, ఓర్పుతో ఉండేవారు.. ఇపుడు ఏదైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు రాజాసింగ్.
.