బషీర్ బాగ్, వెలుగు: గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తలపెట్టిన నూతన ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ శంకుస్థాపనను వ్యతిరేకిస్తున్నట్లు గోషామహల్ పరిరక్షణ కమిటీ తెలిపింది. శుక్రవారం గోషామహల్ నియోజవర్గ బంద్కు పిలుపునిచ్చింది.
గురువారం స్థానిక ఆర్య సమాజ్ వద్ద కమిటీ ప్రతినిధి కోటి శైలేశ్కురుమ మాట్లాడుతూ.. గోషామహల్ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మొండిగా హాస్పిటల్ కట్టి తీరుతామని చెప్పడం సరికాదన్నారు. ఇక్కడి ప్రజలు, వ్యాపారులు నెలలుగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అనంతరం కమిటీ ప్రతినిధులు నిరసన ర్యాలీ నిర్వహించారు.