
- బెల్లంపల్లి మహిళ ఆరోపణ
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి ఏసీబీ కార్యాలయంలో పనిచేస్తున్న హోంగార్డు సురేశ్ తన ఇంటి పరిసరాల్లోని పట్టా భూమిని కబ్జా చేశాడని పట్టణంలోని బూడిదిగడ్డ బస్తీకి చెందిన గోసిక సుధ ఆరోపించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో ఆమె ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ మాట్లాడుతూ..
Also Read : వీఆర్ఎస్ తీసుకున్న.. ఖానాపూర్ ఎమ్మెల్యే భర్త
8న సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి మంత్రి కేటీఆర్ పట్టా అందజేశారని పేర్కొన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పట్టా భూమిలో ఉన్న గోడను కూల్చి భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. 50 సంవత్సరాలుగా ఇదే స్థలంలో ఉంటున్నామని తమకు హోంగార్డుతో ప్రాణహని ఉందని వాపోయారు. డీసీపీ చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని
వేడుకున్నారు.