13 ఏండ్లుగా కోటి గోటి తలంబ్రాల సమర్పణ 

భద్రాచలం, వెలుగు :  ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం 13 ఏండ్లుగా భద్రాచలంలో శ్రీరామనవమికి సీతారాముల కల్యాణం కోసం గోటితో వలిచిన కోటి తలంబ్రాలను సమర్పిస్తోంది. ఈ మేరకు ఆదివారం కూడా 200 మంది భక్తులు భక్తి శ్రద్ధలతో అంబ సత్రంలో 108 మంది మహిళలతో కల్యాణం చేయించి, శ్రీసీతారామచంద్రస్వామికి తలంబ్రాలను అప్పగించారు.

వరి విత్తనాలు నాటడం, పంట పండాక వరి గింజలను సేకరించి తెలుగు రాష్ట్రాల్లోని భక్తులకు పంపించి వారి చేత గోటితో వలిపించడం, పండుగ నాడు వాటిని తీసుకొచ్చి స్వామికి అప్పగించడం ఆనవాయితీ. ఇది 13 ఏండ్లుగా కొనసాగుతోంది. సంఘం అధ్యక్షుడు కల్యాణం అప్పారావు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.