- గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి
సుల్తానాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన స్కాములమయంగా మారిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి ఆరోపించారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు ఆదివారం బీజేపీలో చేరారు. వారికి సురేశ్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాఫియాలకు ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. లీడర్లు సత్యనారాయణ రెడ్డి, ప్రమోద్ కుమార్, మనోహర్, రాజ వీరు, కరుణాకర్, శ్రీధర్, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి
కోరుట్ల: కేంద్రం, రాష్ట్రంలో డబుల్ఇంజిన్సర్కార్ ఉంటేనే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్కుమార్అన్నారు. ఆదివారం కోరుట్లలోని పార్టీ ఆఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో మల్లాపూర్ మండలానికి చెందిన దాదాపు 50 మంది మహిళలు, యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సురభి నవీన్‌కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ నిరంకుశ అవినీతి, అసమర్థ పాలనపై ప్రజలు విసుగుచెందారన్నారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, లీడర్లు నర్సయ్య, మధు, దేవయ్య, శ్రీనివాస్, తుకారాం గౌడ్, రాజేందర్, దేవీలాల్, దామోదర్, గంగాధర్, తిరుమల్, గుంటుక నాగరాజు పాల్గొన్నారు.