కాంగ్రెస్ అసంతృప్తులు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. సెకండ్ లిస్టులో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నారు. తమను కాదని మరొకరికి జాబితాలో చోటు దక్కడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో పార్టీ నాయకత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాసేపటి క్రితమే ఎల్లారెడ్డి టికెట్ దక్కకపోవడంతో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేయగా.. లేటెస్ట్ గా కూకట్ పల్లి మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళ్ రావు పార్టీకి రాజీనామా చేశారు.
వెంగళ్ రావు కూకట్ పల్లి టికెట్ ఆశించారు. అక్టోబర్ 27న రిలీజ్ చేసిన సెకండ్ లిస్టులో కూకట్ పల్లి లికెట్ బండి రమేష్ కు కేటాయించింది కాంగ్రెస్. దీంతో పార్టీకి రాజీనామా చేశారు వెంగళ్ రావు. మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. 40 సంవత్సరాలు పార్టీని నమ్ముకుని ఉంటే అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బండి రమేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. బండి రమేశ్ ను నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లో అడ్డుకుంటామని చెప్పారు.