- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు
- వినతి పత్రం ఇచ్చిన గౌడ ఐక్య సాధన సమితి
ముషీరాబాద్/ పరిగి, వెలుగు: ఓ యూట్యూబ్ చానెల్లో అప్ లోడ్ చేసిన ‘నాలో నేను’ సినిమాలో గౌడ మహిళలను అవమానించేలా సన్నివేశాలున్నాయని.. ఆ మూవీని బ్యాన్ చేయాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం గౌడ ఐక్యసాధన సమితి నాయకులు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆయన ఇంట్లో కలిసి వినతి పత్రం ఇచ్చారు. నాలో నేను మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, టీమ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ కార్య నిర్వహక అధ్యక్షుడు బబ్బురి భిక్షపతి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమార్ గౌడ్, సంఘం నాయకులు ఎర్ర శ్రీనివాస్ గౌడ్, ఆర్ సత్యనారాయణ గౌడ్ తదితరులున్నారు. ‘నాలో నేను’ సినిమా టీమ్‌పై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ విద్యా మౌలిక వసతుల చైర్మన్ నాగేందర్ గౌడ్ స్థానిక గౌడ సంఘం సభ్యులతో కలిసి వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల పీఎస్‌లో కంప్లయింట్ చేశారు. సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.