- గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్
కౌడిపల్లి, వెలుగు: రాజకీయాలు పక్కన పెట్టి గౌడ కులస్తులు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకుంటామని గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు చంద్రం కృష్ణ గౌడ్ అన్నారు. ఆదివారం కౌడిపల్లిలో గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని గౌడన్నలు కలిసి పనిచేయాలన్నారు.
కులంగా ఐక్యమైతే రాజకీయ విజయం సాధ్యమని, సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఐక్యత కోల్పోవడం వల్ల ఇతర కులాల వారు పట్టా పొలాల్లో ఈతవనాలు పెట్టుకుంటూ లైసెన్సులు తీసుకుంటున్నారని, దీనివల్ల గౌడన్నలకు నష్టం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తరాల కోసం కలిసికట్టుగా గౌడన్నలు కృషి చేసినప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.
అనంతరం కొత్తగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రం కృష్ణ గౌడ్ ను రాష్ట్ర అధ్యక్షుడితో పాటు గౌడ సంఘం నాయకులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాగౌడ్, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్, జిల్లా అధ్యక్షుడు చంద్రం కృష్ణ గౌడ్ , మండల అధ్యక్షుడు పుండరీకం గౌడ్, ప్రవీణ్, మహేశ్ గౌడ్, నిరంజన్ గౌడ్, రమేశ్ గౌడ్ ఉన్నారు.