భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : నాసిరకం విత్తనాలు, పురుగుమందులు తయారు చేసే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై కొత్తగూడెంలో శుక్రవారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 2లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు.
దొడ్డు రకం ధాన్యానికి రూ. 500 బోనస్ ఇవ్వాలన్నారు. తడిసిన దాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలపై 75శాతం సబ్సిడీతో రైతులకు అందించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో నాయకులు ఎదళ్లపల్లి సత్యం, అనురాధ, జే. సీతారామయ్య, నర్సింగ్, ఎల్. విశ్వనాథం, రాములు, రాసుద్దీన్, మోకాళ్ల రమేశ్, సుగుణ, మంజుల, భానుచందర్ పాల్గొన్నారు.