VD12 Vijay Devarakonda : VD 12 అప్డేట్పై డైరెక్టర్ గౌతమ్ లెటర్ రిలీజ్..రౌడీ ఫ్యాన్స్ సహనానికి మరో పరీక్ష పెట్టారుగా 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీస్లో..మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది VD12 అని చెప్పుకోవాలి. కారణం ఈ సినిమాకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) కావడమే. ఈ దర్శకుడి నుండి వచ్చిన మళ్ళీ రావా, జెర్సీ సినిమాలు ఆడియన్స్ను అలరించాయి.

ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ మూవీలో విజయ్‌ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఈ సినిమా అనౌన్స్ చేసి రెండేళ్లు దాటినా సరైన అప్డేట్స్ లేవు. ఇక ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే తెలుసుకోవాలని చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

తాజాగా నేడు (మే 9న) విజయ్ దేవరకొండ బర్త్ డే కావడంతో ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్..విజయ్ కు బర్త్డే విషెస్ తెలుపుతూ VD12 మూవీ గురించి ఓ స్పెషల్ లెటర్ ను ప్రకటించింది.

"రౌడీ ఫ్యాన్స్ మరియు తెలుగు ఆడియన్స్ మీ సహనాన్నిమేము అభినందిస్తున్నాము.మా బ్యానర్ లో ఒక అద్భుతమైన సినిమా తీస్తున్నాము. ఈ సినిమా నుంచి అప్డేట్స్ కొంచెం లేట్ అవ్వొచ్చు కానీ మీకు మేము బెస్ట్ ఇస్తాము.ప్రస్తుతం వైజాగ్ లో ఈ సినిమాలోని మాసివ్ సీన్స్ ని షూటింగ్ చేస్తున్నాము.మా అందరికి ఇది ఎంతో ముఖ్యమైన సినిమా.త్వరలో అదిరిపోయే గ్లింప్స్ మీ కోసం రిలీజ్ చేస్తాము అని మేకర్స్ ప్రకటించారు.

దీంతో VD 12 అప్డేట్ పై ఫ్యాన్స్ కి హోప్స్ లేకున్నా..త్వరలో స్పెషల్ వీడియో వస్తుందని  తెలిసాక కాస్తా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే టాక్సీవాలా, శ్యామ్ సింగారాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ సినిమాపై అప్డేట్ వచ్చింది. 1854 నుంచి 1873 సంవత్సరం మధ్య కాలంలో ఈ ఈ సినిమా కథ ఉంటుందని మేకర్స్ తెలిపారు. 

అయితే, ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కావడంతో హైప్ భారీ స్థాయిలో ఉంది. అందుకు కారణం లేకపోలేదు. అనిరుధ్ సినిమా అంటే..అదిరిపోయే సాంగ్స్, బీజీమ్స్, బిట్ సాంగ్స్ ఉంటాయి. 

గౌత‌మ్ తిన్ననూరి ద‌ర్శక‌త్వంలో క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో వ‌చ్చిన హీరో నాని(Nani) తీసిన చిత్రం జెర్సీ(Jersey).2019లో రిలీజైన జెర్సీ సినిమా భారీ విజయాన్ని సాధించి,ఇప్పటివరకు అనేక అవార్డులు గెలుచుకుంది.ఒక్కో సాంగ్ చార్ట్ బ్లాస్టర్ అవ్వడంతో ఇప్పటికీ ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవల్లో ఉంది.

మరి ఇలాంటి కాంబోలో సాంగ్స్ అసలే లేవంటే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉండనుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.