టెన్త్, ఇంటర్ లో పబ్లిక్ ఎక్టామ్స్ వలన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎంత టెన్షన్ ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ పబ్లిక్ ఎగ్జామ్స్ ఫీవర్ 5, 8వ తరగతి విద్యార్థులకు కూడా మొదలు కానుంది.
కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ పాలసీలో కీలక మార్పులకు తీసుకొచ్చింది. 5, 8వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నో డిటెన్షన్ పాలసీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా విద్యాహక్కు చట్టానికి సవరణలు చేసింది. నూతనంగా తీసుకొచ్చిన పాలసీతో కేంద్రీయ విద్యాలయాలలో విద్యావిధానంలో రానున్న మార్పులు:
- గతంలో ఉన్న నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- ఈ విధానం ప్రకారం 5, 8 తరగతిలో ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్లే
- ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో రెండు నెలల్లో సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.
- సప్లమెంటరీ పరీక్షల్లో పాసైతే విద్యార్థులను పైతరగతులకు అనుమతిస్తారు
- సప్లమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ అవే తరగతుల్లోనే కొనసాగాల్సి ఉంటుంది.
- విద్యార్థులు ఫెయిల్ అయినా కూడా 8వ తరగతి వరకు స్కూల్ నుండి తొలగించరాదు
- ఈ నిర్ణయం 3 వేల కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకు వర్తిస్తుంది.
- కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, సైనిక్ స్కూల్స్ మొదలైన విద్యా సంస్థలకు వర్తిస్తాయి.
- 2019 విద్యాహక్కు చట్టంలో మార్పులు చేస్తూ ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది