వనభోజన మహోత్సవంలో ప్రభుత్వ సలహాదారు హర్కార్ వేణుగోపాల్ రావు

వనభోజన మహోత్సవంలో ప్రభుత్వ సలహాదారు హర్కార్ వేణుగోపాల్ రావు

ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల్ క్యాతంపల్లి ఓషధీశ్వర మానసా దేవి సహిత నవనాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా దేవాలయ వ్యవస్థాపకుడు గంట సీతారామారావు రాధాదేవి ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార్ వేణుగోపాల్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

 అనంతరం ఆలయ చైర్మన్​ పవన్​శర్మ మాట్లాడుతూ డిసెంబర్ 6 సాయంత్రం రామకృష్ణ గురు స్వామి ఆధ్వర్యంలో మహా పడిపూజ, 7న సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా అష్టోత్తర ఘటాభిషేకం, లక్ష పుష్పార్చన, హోమం, కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్వో సదానందం, ఎంపీడీవో అనిల్ కుమార్, అమరేందర్ రెడ్డి, కారణం నియోగ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండార్ రాంప్రసాద రావు, భక్తులు పాల్గొన్నారు.