కామారెడ్డి టౌన్, వెలుగు: గ్రంథాలయాలు యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం బుధవారం కామారెడ్డిలో నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం గ్రంథాలయాల్లో అన్ని వసతులు కల్పించటంతో పాటు, మెటీరియల్ సమకూర్చామన్నారు.
ప్రభుత్వ తోడ్పాటుతో పాటు, దాతల సహకారంతో లైబ్రరీల్లో వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. యువత లైబ్రరీలను వినియోగించుకొని ఉద్యోగాలు సాధించాలన్నారు. ఏడాదిలో 51వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. స్థానిక లైబ్రరీని మరింత ఆధునీకరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్ మాట్లాడుతూ..గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం లైబ్రరీలో చదువుకొని పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో రంగనాథ్‌రావు, డీఎస్పీ నాగేశ్వర్రావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉరుదొండ వనిత, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.