
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ
- జిల్లా కేంద్రం, భిక్కనూరు మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
కామారెడ్డి, వెలుగు : ‘కాంగ్రెస్ పేదల ప్రభుత్వం.. వారికి నిరంతరం అండగా ఉంటాం..’ అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో 24 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించి మాట్లాడారు. ప్రజా శ్రేయస్సు కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు అదనంగా పనులు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, లీడర్లు ఇంద్రకరణ్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, పండ్ల రాజు, పున్న రాజేశ్వర్, భీమ్‌రెడ్డి, గోనె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు మండల కేంద్రంలో..
భిక్కనూరు : మండల కేంద్రంలో శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యం బారిన పడినవారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భీమ్‌రెడ్డి, గ్రంధాలయ సంస్ధ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టౌన్ప్రెసిడెంట్ అందె దయాకర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గంగల భూమయ్య, బద్దం ఇంద్రకరణ్‌రెడ్డిలు పాల్గొన్నారు.