- ఎన్నికల్లో ఇచ్చిన హామిల కంటే ఎక్కువ చేస్తున్నాం
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ
కామారెడ్డిటౌన్, వెలుగు : ఈ నెల26 నుంచి నాలుగు పథకాలు అమలు చేయనున్నట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ చేస్తున్నామన్నారు. గురువారం కామారెడ్డి టౌన్‌లోని మటన్ మార్కెట్ కాంప్లెక్స్‌లో షాపులు కేటాయించిన వారికి పత్రాలు అందించారు. 49వ వార్డులో జరిగిన ప్రజాపాలన వార్డు సభలో షబ్బీర్‌అలీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల అమలు ఉంటుందన్నారు.
ఈ పథకాల అమలులో గ్రామ సభలో కీలకమన్నారు. అభ్యంతరాలను అధికారులు నివృత్తి చేస్తారన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నందున పాత రేషన్ కార్డులు తొలగిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 23 ఏండ్ల క్రితం తాను మంత్రిగా ఉన్నప్పుడు మటన్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగిందని, అప్పటి నుంచి షాపుల కేటాయింపు జరగలేదన్నారు.
సమస్య నా దృష్టికి వచ్చినవెంటనే అధికారులతో మాట్లాడి షాపుల కేటాయింపు చేశామన్నారు. మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, మున్సిపల్ కమిషనర్ స్పందన, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, కౌన్సిలర్ కన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.