అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ : షబ్బీర్​అలీ 

అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ : షబ్బీర్​అలీ 

కామారెడ్డి, వెలుగు: అందరికీ అమోదయోగ్యంగా రాష్ర్ట బడ్జెట్ ఉందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్​లకు తగిన ప్రయార్టీ లభించేలా ఉందన్నారు. వ్యవసాయ రంగానికి కూడా పెద్ద పీట వేశారన్నారు. పట్టణాలు, పల్లె ల అభివృద్ధికి దోహాదపడుతుందన్నారు.  మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేసే ఉద్దేశంతో మహిళా శక్తి స్కీమ్​ ప్రారంభిస్తున్నట్లు షబ్బీర్​అలీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జనరంజక బడ్జెట్ డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్​ శ్రీనివాస్​రావు

స్టేట్​బడ్జెట్ జనరంజకం అని కామారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్​కైలాస్​శ్రీనివాస్​రావు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలు,మహిళలు, రైతు సంక్షేమానికి అధిక ప్రయార్టీ దక్కిందన్నారు.  రాష్ర్టానికి న్యాయం చేసేలా బడ్జెట్ ఉందని ఆయన పేర్కొన్నారు.

దశాదిశను మార్చే బడ్జెట్ డీసీసీ ప్రెసిడెంట్​ మోహన్​రెడ్డి

నిజామాబాద్, వెలుగు: అన్ని రంగాలను సమన్వయపరుస్తూ రాష్ట్ర గవర్నమెంట్​ చేసిన బడ్జెట్​కేటాయింపులు దశాదిశను మారుస్తుందని డీసీసీ ప్రెసిడెంట్​మానాల మోహన్​రెడ్డి అన్నారు.  వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ రూ.72 వేల కోట్ల నిధులు అలాట్​ చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు గతం కంటే అధిక కేటాయింపులు కేటాయించి చిత్తశుద్ధి చాటారన్నారు.