- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ
- కామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ గా ఇందుప్రియ బాధ్యతల స్వీకరణ
కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి పట్టణాన్ని మరింత డెవలప్మెంట్ చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రొగ్రాంకు షబ్బీర్‌అలీ హాజరై చైర్ పర్సన్‌ను అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఎనిమిది నెలల్లో బెస్ట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఎంపీ ఎలక్షన్ తర్వాత సీఎం సమక్షంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లతో మీటింగ్ ఏర్పాటు చేయిస్తానన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంను మరింతగా అధునీకరిస్తామని, టౌన్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామన్నారు.