పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 
  • కేజీబీవీ విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ 

వేములవాడ/ కోరుట్ల, వెలుగు:  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.  మంగళవారం వేములవాడ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆర్​బీఎస్​కే  ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు.  రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మంజూరు చేశామని తెలిపారు.

 జిల్లా వ్యాప్తంగా 338 మంది విద్యార్థులను గుర్తించి కంటి అద్దాలను పంపిణీ చేశారు.  జిల్లా వైద్యాధికారి రజిత పాల్గొన్నారు.  కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో పల్లె దవాఖాన, మండల పరిషత్  ప్రైమరీ స్కూల్​లో అదనపు తరగతి గది నిర్మాణానికి భూమిపూజ చేశారు.   గంభీర్​పూర్​ గ్రామంలో జడ్పీ హై స్కూల్​లో ఆర్​బీఎస్​కే ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి అద్దాలను  పంపిణీ చేశారు.