మెదక్‌టౌన్, వెలుగు : మెదక్నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తొలి ఏడాదిలోనే రూ.750 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే రోహిత్‌రావు మంగళవారం తెలిపారు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి ఏడుపాయలకు రావడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గానికి తీరని అన్యాయం జరిగిందని రోహిత్‌రావు విమర్శించారు.