తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త మండలాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పాల్వంచ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన గెజిట్ ను విడుదల చేసింది. 10 గ్రామాలతో పాల్వంచ మండలంగా ఏర్పాటు చేసింది. తాజా మండలంతో కామారెడ్డి జిల్లాలో మండలాల సంఖ్య 24 కు చేరింది.
పాల్వంచ మండలంలో ఏ ఏ గ్రామాలు..
నూతనంగా ఏర్పడిన పాల్వంచ మండలంలో మొత్తం 10 గ్రామాలు ఉండనున్నాయి. ఎల్పుగోండ, వాడి, ఫరిద్ పేట్, బండ రామేశ్వర్ పల్లి, ఇసాయిపేట్, దేవన్ పల్లి, పోతారం గ్రామాలతో పాల్వంచ మండలంగా మారింది.
కామారెడ్డి జిల్లాలో ఎన్ని మండలాలున్నాయంటే
కామారెడ్డి జిల్లాలో మొత్తం 24 మండలాలున్నాయి. అవి ఏంటంటే..
1 బాన్సువాడ, 2 బీర్కూర్, 3 బిచ్కుంద, 4 జుక్కల్, 5 మద్నూర్, 6 నిజాంసాగర్, 7 పిట్లం, 8 నస్రుల్లాబాద్, 9 పెద్ద కొడప్‌గల్, 10 కామారెడ్డి, 11 భిక్నూర్, 12 రాజంపేట, 13 దోమకొండ, 14 మాచారెడ్డి, 15 రామారెడ్డి, 16 బీబీపేట్, 17 తాడ్వాయి, 18 సదాశివనగర్, 19 యోల్లారెడ్డి, 20 గాంధారి, 21 లింగంపేట్, 22 నాగారెడ్డిపేట, 23 డోంగ్లీ, 24 పాల్వంచ.