తెలంగాణలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు..

తెలంగాణలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు..

 తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ విషయానికి వర్షాల వల్ల ట్రాఫిక్ జామ్ ఒకవైపు, జలమయమవుతున్న రోడ్లతో జనజీవనం స్తంభించిపోతోంది. ఈ నేపథ్యంలో  గ్రేటర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పై విద్యా శాఖ అలర్ట్ అయ్యింది.

హైదరబాద్రం,గా రెడ్డి జిల్లాల పరిధిలోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది విద్యాశాఖ. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావాన్ని బట్టి సెలవు ప్రకటించాలని డిఈవో, ఎంఈవో లకు ఆదేశాలు జారీ చేసింది పాఠశాల విద్యాశాఖ.