పలువురు ఐఏఎస్‌‌‌‌‌‌‌‌లకు అదనపు బాధ్యతలు

పలువురు ఐఏఎస్‌‌‌‌‌‌‌‌లకు అదనపు బాధ్యతలు
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. మరికొందరిని బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆయేషా మస్రత్‌‌‌‌‌‌‌‌ ఖానంను ప్రభుత్వం బదిలీ చేసి.. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆ బాధ్యతలను తఫ్సీర్‌‌‌‌‌‌‌‌ ఇక్బాల్‌‌‌‌‌‌‌‌కు అదనంగా అప్పగించారు.  

కె. సురేంద్ర మోహన్‌‌‌‌‌‌‌‌కు గనుల శాఖ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. జి.మల్సూర్​కు  రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.  షేక్‌‌‌‌‌‌‌‌ యాస్మిన్‌‌‌‌‌‌‌‌ బాషా - మైనార్టీ సంక్షేమ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా,  టి.వినయ్‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి - భూసేకరణ, పునరావాస కమిషనర్‌‌‌‌‌‌‌‌గా, నిర్మల కాంతి వెస్లీకి  మైనార్టీ ఆర్థిక సంస్థ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వక్ఫ్‌‌‌‌‌‌‌‌బోర్డు సీఈవోగా మహ్మద్‌‌‌‌‌‌‌‌ అసదుల్లాను -నియమించారు.  ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా పి.శ్రీజను నియమిస్తూ సీఎస్​ జీవో జారీ చేశారు.