156 మందులపై నిషేధం

156 మందులపై నిషేధం

న్యూఢిల్లీ: ఆరోగ్యానికి హాని చేసే 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీసీ) మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం గురువారం బ్యాన్ చేసింది. జ్వరం, హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి జబ్బుల చికిత్సల్లో వాడే యాంటీబయోటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెయిన్ కిల్లర్లు, మల్టీ విటమిన్స్ ఇందులో  ఉన్నాయి. ఈ మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడితే  ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని రివ్యూ తర్వాత  ప్రభుత్వం పేర్కొంది. ఈ  156 ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీసీ మెడిసిన్స్ తయారీని, అమ్మకాన్ని, డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిషేధిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది.  డ్రగ్ టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వైజరీ బోర్డ్ (డీటీఏబీ), నిపుణుల కమిటీ సిఫార్సుతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. 

Also Read:-ప్రపంచంలోనే తొలి పోర్టబుల్​ హాస్పిటల్​

బ్యాన్ చేసిన మందుల్లో చికిత్సకు ఉపయోగం కాని  ఇంగ్రీడియెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయని తేలిందని పేర్కొంది. ఈ బ్యాన్ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మెఫెనమిక్ యాసిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  పారాసిటమాల్​ ఇంజెక్షన్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎక్కువ మెడిసిన్స్ ఉన్నాయి. దీన్ని వాపులు, నొప్పి తగ్గించడానికి వాడతారు. ఓమెప్రజోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెగ్నీషియం, డైక్లోమైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మందులు కూడా ఉన్నాయి. వీటిని  కడుపు నొప్పి ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  వాడతున్నారు. ఫ్యాటీ లివర్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాడే యుర్సోడియాక్సికోలిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా బ్యాన్ లిస్ట్‌‌‌‌లో ఉన్నాయి.