
వరంగల్, వెలుగు : హనుమకొండలో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో బుధవారం నిర్వహించనున్న కార్మిక యుద్ధభేరి సభను సక్సెస్ చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కోరారు. ఈ సభకు మంత్రులు హరీశ్‌రావు, ఎర్ర బెల్లి దయాకర్‌రావు హాజరవుతున్నట్లు తెలి పారు. మంగళవారం ఆటో నడుపుతూ, షాపింగ్ మాల్ వర్కర్లను కలిసి ప్రచారం చేశారు.
అనంతరం ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో మీడియాతో మాట్లాడారు. మే నెలలో కార్మిక మాసోత్సవం నిర్వహించి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో 6,900 మంది కార్మికులు వివిధ శాఖల ద్వారా రూ.41 కోట్ల లబ్ధి పొందారని చెప్పారు. కార్మిక యుద్ధభేరి సభకు సంఘటిత, అసంఘటిత కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.