- ఎక్కడ రెగ్యులరైజ్ చేస్తే..అక్కడి ఖాతాల్లో వేయాలని సర్కార్ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ఎల్ఆర్ఎస్పై వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖాతాలో కాకుండా ఎక్కడ రెగ్యులరైజ్ చేస్తే.. అక్కడి ఖాతాల్లో జమయ్యేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్న ది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. గత ప్రభుత్వం అక్టోబర్ 31, 2020 వరకు ఎల్ఆర్ఎస్ దర ఖాస్తులు స్వీకరించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాటిని పరిష్కరిస్తున్నది.
దాదాపు రూ.10 వేల కోట్లు ఎల్ఆర్ఎస్తో వస్తుందని ప్రభుత్వం భావి స్తున్నది. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు కాకుండా.. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేష న్లు, గ్రామాలకే జమ చేయాలని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే జిల్లాల్లో అప్లికేషన్ల ప్రాసెస్ మొదలైంది.
మొత్తం 25.70 లక్షల ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు రాగా.. ఇందులో హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధి లో 1.06 లక్షలు, కార్పొరేష న్లు, మున్సిపాలిటీల పరిధిలో 13.69 లక్షలు, గ్రామాల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు వచ్చాయి.