తొలిరోజు 76,963 మంది రైతులకు రైతు బంధు జమ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో తొలిరోజు మంగళవారం 76,963 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులను జమ చేసింది. ఈ మేరకు ఇందుకు సంబంధించి రూ.20,30,10,789లను ట్రెజరీలో జమ చేసింది. ఒకటి, రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఆ మొత్తం ట్రాన్స్ ఫర్ కానుంది.