
మణుగూరు, వెలుగు : భద్రాచలంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో కంటి వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ను మణుగూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మణుగూరు సీఐ సతీశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మణుగూరుకు చెందిన డోకుపర్తి రమాకాంత్ భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ లో కంటి డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి భార్య డాక్టర్ సంఘమిత్ర మణుగూరులో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు.
వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్ధలు వచ్చాయి. ఈ క్రమంలో రెండు రోజుల కింద భార్యాభర్తలు గొడవ పడుతుండగా అడ్డువచ్చిన సంఘమిత్ర తల్లిని రమాకాంత్ తీవ్రంగా గాయపరిచాడు. సంఘమిత్ర ఫిర్యాదు మేరకు రామాకాంత్ పై వరకట్న వేధింపుల చట్టంతో పాటు, బీఎన్ఎస్ యాక్ట్ 118 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.