
రాహుల్ గాంధీ మాటకు అనుగుణంగా బీసీ కుల గణన చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లు పెడుతామని చెప్పారు. రిటైర్డ్ జడ్జి, బీసీ సంఘాల నేతల సలహాలు తీసుకుంటామని తెలిపారు. బీసీల్లోని అన్ని కులాలవారు గర్వంగా భావించాల్సిన సందర్భం ఇదని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత గత పదేళ్ల నుంచి మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రాహం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
రాజకీయం చేయాలని అనుకుంటే బయట చేయాలని కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. లిక్కర్ బిజినెస్ బిజీ నుంచి తగ్గినట్టు ఉందని అందుకే ఇప్పుడు జ్యోతిరావు పూలే విగ్రహం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కు అంత చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ పార్టీలో అధ్యక్ష పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి శాసన సభ పదవిని బీసీలకు ఇచ్చి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.