చంద్రబాబు ఇంటికే లంచం తీసుకున్నాడు.. ఆ ఉద్యోగిని ఇప్పుడు పీకేశారు..!

చంద్రబాబు ఇంటికే లంచం  తీసుకున్నాడు.. ఆ ఉద్యోగిని ఇప్పుడు పీకేశారు..!

కుప్పంలో  నూతనంగా నిర్మిస్తున్న సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి సంభందించిన రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకున్నాడు ఓ ప్రభుత్వ అధికారి. వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కుప్పంలో ఓ ఇల్లు నిర్మించాలని అనుకున్నారు. అందుకుగాను కుప్పంలోని ఓ రైతు నుంచి ఇంటికి అవసరమయ్యే స్థలాన్ని కొనుగోలు చేశారు చంద్రబాబు. 

ఈ క్రమంలోనే స్థలాన్ని అమ్మేందుకు సర్వే కోసం రెవిన్యూ డిప్యూటీ సర్వేయర్ ను సద్దాంహుసేన్ రమ్మని రైతు అర్జి పెట్టుకున్నారు. ఇందుకు సర్వేయర్ తనకు లంచం ఇస్తేనే వస్తా అని ఖరాకండిగా చెప్పడంతో రైతు చేసేదేమి లేక కట్నం అదే నండి లంచం సమర్పించుకున్నాడు. రైతు నుండి లక్ష రూపాయలు లంచంగా తీసుకున్నాడు సద్దాంహుసేన్.

Also Read:మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ప్రవర్తనపై చంద్రబాబు ఆగ్రహం

 చంద్రబాబు సీఎం హోదాలో కుప్పంలో తొలి సారిగా పర్యటన చేయగా రైతు ఫిర్యాదు చేశాడు. వెంటనే సీఎం కలెక్టర్ కు ఎంక్వైరీ వేయాలని ఆదేశాలు జారీ చేశారు.  ఎంక్వైరీలో డిప్యూటీ సర్వేయర్ సద్దాంహుసేన్ లంచం తీసుకున్నట్టు తేలడంతో అధికాలు ఆయన్ను సస్పెండ్ చేశారు.