ఆదిలాబాద్​లో సర్కారీ ఇంజినీరింగ్ కాలేజీ

ఆదిలాబాద్​లో సర్కారీ ఇంజినీరింగ్ కాలేజీ

హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్టీయూకు అనుబంధంగా ఈ కాలేజీ ఉంటుందనీ, కోర్సులు, స్టాఫ్, బడ్జెట్ కు సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు జీఓలో పేర్కొన్నారు. అయితే, కాలేజీని ఏ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తారనే  దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో వచ్చే ఏడాదే కాలేజీ ప్రారంభమయ్యే అవకాశముంది.