ఇవాళ మొబైల్ ఫోన్ లకు వచ్చిన ఓ మెసెజ్ కస్టమర్లను భయాందోళనకు గురిచేస్తోంది. టెలికమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ నుంచి ఎమర్జెన్సీ అలర్ట్ అని మెసేజ్ వచ్చింది. బీప్ సౌండ్ తో ఈ మెజేజ్ లు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చిందో ..ఎందుకు వచ్చిందో తెలియక కాసేపు గందరగోళానికి గురయ్యారు కస్టమర్స్ . కొందరు సెల్ ఫోన్స్ హ్యకయ్యాయేమోనని భయపడ్డారు. ఫోన్లు రీస్టార్ట్ చేయడం, రిపేర్ కు ఇవ్వడం లాంటివి చేశారు.
అయితే ఎవరూ భయపడాల్సిన పని లేదు.. ఎందుకంటే ఈ మెసేజ్ ను కేంద్ర ప్రభుత్వమే పంపిందంట. ఇప్పటికే పలు ప్రాంతాల ప్రజలకు ఇలాంటి మెసేజ్‌లు రాగా.. లేటెస్ట్ గా మరోసారి ఈ మెసేజ్ వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
ALSO READ : World Cup2023: ఐసీసీ కొత్త రూల్స్.. బ్యాటర్లకు ఇక చుక్కలే
అయితే ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్(TEST) విభాగానికి చెందిన టెస్టింగ్ మెసేజ్. దీనిని పట్టించుకోకండి. ఎందుకంటే. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించిన పాన్-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించేందుకు ఈ మెసేజ్‌ను పంపించాం. విపత్తు, నిర్వహణ, పబ్లిక్ సేఫ్టీలో భాగంగానే దేశ వ్యాప్తంగా ఈ మెసేజ్ పంపిస్తున్నాం అని మెసేజ్ లో ఉంది.