ప్రత్యక్ష ప్రసార టీవీ ఛానెల్‌లను ఇకపై నేరుగా మొబైల్ ఫోన్‌లలోనూ చూడొచ్చు. ఇందుకోసం కేంద్రప్రభుత్వం కొత్త మార్గాన్ని పరిశీలిస్తోంది. ఇది డైరెక్ట్-టు-హోమ్ (DTH) సేవలను పోలి ఉంటుంది. డైరెక్ట్-టు-మొబైల్ (D2M) అని పిలువబడే ఈ సాంకేతికత..డేటా కనెక్షన్ అవసరం లేకుండా వినియోగదారులు తమ మొబైల్‌లలో టీవీని చూసేలా వినియోగించబడుతుంది. టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT), సమాచార, ప్రసార శాఖ (MIB), IIT-కాన్పూర్ సంయుక్తంగా ఈ సాంకేతికతను డెవలప్ చేస్తుందని శనివారం ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది.
టెలికాం ఆపరేటర్లకు ఆదాయం ఎక్కువగా వీడియో వినియోగంపై ఆధారపడి ఉంటుంది. టెలికాం ఆపరేటర్లు తమ రాబడికి నష్టం వచ్చే అవకాశం ఉందనిఆందోళన చెందే అవకాశం లేకపోలేదు. దీంతో ఈ D2M విధానం వారి 5G వ్యాపార వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిపై మేం సాధ్యాసాధ్యాలను పరిశిలిస్తున్నారు. టెలికం ఆపరేటర్లతో సహా మిగతా వాటాదారులతో చర్చలు జరుపనున్నట్లు అధికారులు చెబుతున్నారు. DoT, MIB, IIT-కాన్పూర్, టెలికం, ప్రసార రంగాలకు ప్రతినిధులతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. త్వరలో 5G ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రసార,బ్రాడ్‌బ్యాండ్ సేవల కలయికకోసం ప్రభుత్వ అధికారులు కంటెంట్ డెలివరీ పద్ధతులను విలీనం చేయడాన్ని పరిశీలిస్తున్నారు.