టమాట ధరలను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం

టమాట ధరలను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: టమాట ధరల్లో హెచ్చుతగ్గులను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం  28 ఇన్నోవేటివ్ స్టార్టప్‌‌‌‌ ఐడియాలకు ఆర్థిక సాయం చేయనుంది. ఇందులో టమాటల నుంచి వైన్ తయారు చేసే స్టార్టప్‌‌‌‌ కూడా ఉంది. టమాట ప్రాసెసింగ్‌‌‌‌, సప్లయ్‌‌‌‌ చెయిన్‌‌‌‌ను మెరుగుపరిచే ఐడియాలకు ప్రభుత్వం ఫండింగ్ అందించనుంది. టమాట సప్లయ్‌‌‌‌ చెయిన్‌‌‌‌ను మెరుగుపరిచే స్టార్టప్‌‌‌‌లకు సపోర్ట్ చేసేందుకు  కిందటేడాది జూన్‌‌‌‌లో టమాట గ్రాండ్ ఛాలెంజ్ (టీజీసీ) హ్యాకథాన్‌‌‌‌ను  లాంచ్ చేశామని కన్జూమర్ అఫైర్స్ సెక్రెటరీ నిధి ఖారా అన్నారు. అఫోర్డబుల్ ధరల్లో టమాటలు వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చేయడం, రైతులకు మంచి ధర దక్కేలా చేయడమే టీజీసీ టార్గెట్ అని అన్నారు.

టమాట ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నాయని, కొన్నిసార్లు ధరలు భారీగా పెరుగుతున్నాయని, మరికొన్నిసార్లు రైతులకు కనీస ధరే దొరకడం లేదని ఆమె పేర్కొన్నారు. టీజీసీ కింద 1,376 ఐడియాలు అందుకున్నామని, మొదటి స్టేజ్‌‌‌‌లో 423 సెలెక్ట్ అయ్యాయని అన్నారు. చివరికి 28 ఐడియాలకు  ప్రభుత్వం ఫండింగ్ ఇస్తుందని చెప్పారు. రెండు కేటగిరీల్లో ఈ ఐడియాలను సెలెక్ట్ చేశారు. ఒకటి స్టూడెంట్స్‌‌‌‌, రీసెర్చ్ స్కాలర్స్‌‌‌‌, ఫ్యాకల్టీ మెంబర్లు కాగా, రెండోది ఇండస్ట్రీ ఇండివిడ్యువల్స్‌‌‌‌, ఇండియన్ స్టార్టప్‌‌‌‌లు, మైక్రో, స్మాల్‌‌‌‌, మీడియం ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌లు, లిమిటెడ్‌‌‌‌ లయబిలిటీ పార్టనర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌లు, ప్రొఫెషనల్స్‌‌‌‌.  28  ఐడియాల్లో పద్నాల్గింటికి పేటెంట్స్ రిజిస్టర్ అయ్యాయి.