ఏళ్లనాటి కల సాకారం.. కరకట్ట పనులకు శ్రీకారం

  • నేషనల్ హైవే అథారిటీకి  లెటర్​ రాసిన ఇరిగేషన్​ 
  • భద్రాచలంలో మిగిలిన కరకట్ట పనులు షురూ 
  • గోదావరి వరదల నుంచి బయటపడనున్న శివారు కాలనీలు

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని కరకట్ట పనులకు సర్కారు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. దీంతో ఏళ్లనాటి కల సాకారం కానుంది.  శుక్రవారం అధికారులు  కరకట్ట మిగిలిన పనులను మొదలుపెట్టారు. ఇక గోదావరి వరద సమస్యల నుంచి పలు కాలనీలు బయటపడనున్నాయి. 2007లో కూనవరం రోడ్డులో కరకట్ట పొడిగింపునకు నాటి ఇరిగేషన్ ​ఇంజినీర్లు కసరత్తు మొదలుపెట్టారు. ఉన్న కరకట్టను ఎత్తు పెంచి, మిగిలిన పనులు చేయాలని భావించినా నిధులు సరిపోలేదని కాంట్రాక్టర్​ మధ్యలో వదిలేశారు.

అప్పటి నుంచి ఏటా గోదావరి వరదలు వస్తే సుభాష్​నగర్, శాంతినగర్​ కాలనీలు నీటమునుగుతున్నాయి. కరకట్ట ఉన్నా ఊళ్లోని 40శాతం శివారు కాలనీలు ముంపులోనే ఉంటున్నాయి. దీనికి తోడు ఇటీవల పోలవరం బ్యాక్ వాటర్​ సమస్య వచ్చిపడింది. వర్షాకాలం చినుకుపడితే చాలు గోదావరి ఉప్పొంగి భద్రాద్రిని చుట్టుముడుతోంది. మిగిలిన కరకట్ట పనులు పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.38.45కోట్లు ఎస్డీఎఫ్​ నిధులు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేసినా  ఎన్నికల కోడ్​తో మధ్యలోనే ఆగాయి. దీంతో ఇక పనులు జరగవని ఆందోళన చెందిన స్థానికులు జిల్లా మంత్రులను కలిసి తమ గోడు వెళ్లబో ఓకే చెప్పింది. శుక్రవారం నుంచి జంగిల్​కటింగ్ పనులు 
జరుగుతున్నాయి. 

700 మీటర్ల పొడవు కరకట్ట
కూనవరం రోడ్డులో భద్రాచలం టౌన్​ శివారున 700 మీటర్ల పొడవునా మిగిలిన కరకట్ట పనులను ప్రారంభించారు. విజయవాడ–-జగదల్​పూర్​ జాతీయ రహదారికి అడ్డంగా సరస్వతి శిశుమందిర్​ వద్ద కరకట్ట నిర్మించాల్సి ఉంటుంది. దీని కోసం నేషనల్ హైవేస్​ అథారిటీ అప్రూవల్​ కోసం ఇరిగేషన్ ఇంజినీర్లు లెటర్​ రాశారు. అక్కడ ఫ్లైఓవర్​ నిర్మాణం కోసం కొన్ని డిజైన్లు కూడా అందజేశారు.

 అయితే నేషనల్ హైవేస్​ స్టాండర్డ్స్ ప్రకారం నిర్మాణాలు జరపాల్సి ఉంటుంది. కొన్ని మార్పులు, చేర్పులు సూచించాక ఇరిగేషన్​ శాఖ ఆ డిజైన్ల ప్రకారం నిర్మాణాలు చేపడుతుంది. కాగా రోడ్డుకు అటూ,ఇటూ రెండు వైపులా కరకట్ట మట్టి పనులు ముందుగా ప్రారంభిస్తారు. వీటితో పాటు కరకట్టపై రెండు చోట్ల సీడీ వర్క్స్ కూడా చేయనున్నారు. ఊరులోని డ్రైన్​ వాటర్​ బయటకు పంపేలా గేట్లు నిర్మిస్తారు. 

రైతులకు నష్టం లేకుండా చేయాలి

కరకట్ట పనులను రైతులకు నష్టం లేకుండా చేపట్టాలి. పొలాల్లోకి వరద రాకుండా చూడాలి. టెక్నికల్​ ప్రాబ్లం లేకుండా, పనులు ఆగకుండా త్వరగా పూర్తి చేయాలి. 

వేగంగా పనులు..
కరకట్ట పనులు వేగంగా నిర్వహిస్తాం. నేషనల్ హైవేస్​ ఆఫీసర్లు ఫ్లైఓవర్​ ఇతర పనులకు డిజైన్లు ఓకే అంటే పనులు మొదలుపెడతాం. వర్షాకాలం నాటికి పూర్తయ్యేలా చూస్తాం.

స్థలం అప్పగింత

భద్రాచలంలో కరకట్టల నిర్మాణాలకు గతంలో 33 ఎకరాల భూమిని సేకరించారు. చాలా కాలం తర్వాత పనులు జరుగుతున్నందున సర్వే నంబర్ల ప్రకారం భూమిని సర్వేయర్లు మళ్లీ కొలిచారు. జెండాలు పాతి కరకట్ట పనులకు అప్పగించారు. ఇరిగేషన్​, రెవెన్యూశాఖలు జాయింట్​ సర్వే నిర్వహించాయి.