సీతారామ ప్యాకేజీ 6కు టెండర్ల ఆహ్వానం

 సీతారామ ప్యాకేజీ 6కు టెండర్ల ఆహ్వానం
  • రూ.315 కోట్ల అంచనా వ్యయం ప్రతిపాదన

హైదరాబాద్, వెలుగు: సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్​ప్రాజెక్ట్​లో సర్కారు మరో టెండరును పిలిచింది. ప్రాజెక్ట్​లో భాగంగా చేపడుతున్న డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్​ ప్యాకేజీ 6లోని వివిధ పనులకు రూ.315.89 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించింది. సత్తుపల్లి మెయిన్​ కెనాల్​లోని డీ 1 నుంచి డీ 15, ఎన్​టీఆర్​ ఫ్లడ్​ ఫ్లో కెనాల్​లోని డీ 16 నుంచి డీ 35 వరకు ఎర్త్​వర్క్​ ఎక్స్​కవేషన్, ఎంబార్క్​మెంట్, కన్ స్ట్రక్షన్​ ఆఫ్​ స్ట్రక్చర్, కెనాల్స్​ లైనింగ్​ పనులను చేయాల్సి ఉంటుంది. బుధవారం నుంచి టెండర్లు అందుబాటులోకి వచ్చినట్టు కల్లూరు ఎస్ఈ నోటిఫికేషన్​ ద్వారా తెలియజేశారు. నవంబర్​ 4 వరకు టెండర్లను వేసేందుకు గడువిచ్చారు.

బున్యాదిగని కెనాల్​కు రూ.266 కోట్లు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బున్యాది కెనాల్​ పునరుద్ధరణ పనులకు సర్కారు నిధులు మంజూరు చేసింది. కెనాల్​ స్టార్టింగ్​ పాయింట్​ నుంచి 98 కిలోమీటర్ల​వరకు పునరుద్ధరణ పనుల కోసం రూ.266.65 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.