ఏదులాపురం మున్సిపాలిటీ కోసం ప్రజాభిప్రాయ సేకరణ

ఏదులాపురం మున్సిపాలిటీ కోసం ప్రజాభిప్రాయ సేకరణ

ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం రూరల్​ మండలంలోని 12 గ్రామ పంచాయతీలను కలిపి ఏదులాపురం మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాతీరాజ్​ అధికారులు బారుగూడెం, చిన్న వెంకటగిరి, ఏదులాపురం, గొళ్లగూడెం,  గోళ్లపాడు, గుర్రాలపాడు, మద్దులపల్లి, ముత్తగూడెం, పెద్దతండా, భద్రాద్రి కాలనీ, సాయి నగర్​ కాలనీ, ఫోర్త్​ క్లాస్​ ఎంప్లాయీస్​ కాలనీ, వికనలగూడా కాలనీ, దబుల్​ బెడ్​రూం ఏరియా, రాజీవ్​ గృహకల్ప, రెడ్డిపల్లి, పల్లెగూడెం, తెల్దారుపల్లి గ్రామాలను కలుపుతూ కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇందు కోసం​ ప్రభుత్వానికి కలెక్టర్ ముజామ్మిల్​ ఖాన్​ ప్రపోజల్ కూడా పంపించారు. 12 గ్రామాల్లో అధికారులు ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. మంగళవారం మద్దులపల్లి గ్రామంలో ఎంపీవో రాజారావు ఆధ్వర్యంలో ప్రజా అభిప్రాయం సేకరించారు. మున్సిపాలిటీకి అనుకూలంగా 37 మంది చేతులు ఎత్తారు. వ్యతిరేకంగా 24 మంది చేతులు ఎత్తారు. కాగా మెజార్టీ ప్రజలు మున్సిపాలిటీకి అనుకూలంగా ఉన్నట్లు ఎంపీవో తెలిపారు.  ఈ  కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ డీ. శీరిష, గ్రామస్తులు అంబటి సుబ్బారావు, ఏటుకూరి సుధాకర్, అంబటి ఈశ్వర్​, నల్లపునేని రమణయ్య, ఉన్నం రంగారావు, సప్పిడి ప్రభాకర్, సలవాది రాజేశ్, రెంటాల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.