న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లాలంటే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అవసరమనే రిపోర్ట్స్‌పై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రపోజల్ అందరి కోసం కాదని, ఆర్థిక మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు లేదా రూ.10 లక్షలకు మించి ట్యాక్స్ బకాయిలు చెల్లించాల్సిన వారు మాత్రమే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలని పేర్కొంది.
ఫైనాన్స్ బిల్లు, 2024 లో బ్లాక్ మనీ యాక్ట్ కింద ఈ ప్రపోజల్‌ను ఫైనాన్స్ మినిస్ట్రీ చేర్చింది. బకాయిలను చెల్లించి ఎవరైనా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను పొందొచ్చని పేర్కొంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం, 1961 ప్రకారం, ప్రతి ఒక్కరు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను పొందాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉంటుంది.